మహేష్ కోసం సింపుల్ గానే ముగించేసిన ఇళయ థలపతి.!

Published on Aug 12, 2020 7:03 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సినీ వర్గాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరందుకుంది. దీనితో మన స్టార్ హీరోలతో సహా స్టార్ హీరోయిన్లు కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఒకరికొకరు ఇచ్చుకుంటు కొనసాగిస్తున్నారు.

అలా ఇటీవలే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని ఇళయ థలపతి విజయ్ కు కూడా ఈ ఛాలెంజ్ విసిరారు. దీనికి బదులుగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని విజయ్ ఈ ఛాలెంజ్ ని పూర్తి చేసి మహేష్ కు తెలిపి అందరూ ఇంట్లో సేఫ్ గా ఉండాలని కోరుకున్నారు.

ఇది మాత్రం చాలా సింపుల్ గా హంబుల్ గా ఉంది. పైగా ఈ ఛాలెంజ్ మహేష్ చెప్పారని చేశారే తప్ప మరెవ్వరికీ తాను ఛాలెంజ్ చెయ్యలేదు. విజయ్ చేసిన ట్వీట్ కు బదులుగా మహేష్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలపడంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More