వైరల్ వీడియో : ఫ్యాన్స్ తో ఇళయదళపతి విజయ్ వీడియో సెల్ఫీ

Published on Dec 25, 2022 2:08 am IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వరిసు పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ హైప్ ఏర్పరిచాయి. కాగా వరిసు మూవీ యొక్క అఫీషియల్ ఆడియో లాంచ్ నిన్న చెన్నై లో ఎందరో ప్రేక్షకాభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది.

కాగా ఈ వేడుకకు ఎంతో సింపుల్ కాస్ట్యూమ్స్ తో వచ్చిన ఇళయదళపతి విజయ్, తన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, వారందరితో కలిసి ఒక సెల్ఫీ వీడియో దిగారు. ఇక విజయ్ వీడియో తీస్తున్నంతసేపు అభిమానుల హర్షద్వానాలు మారుమ్రోగాయి. ఇక ఆ వీడియోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు విజయ్. ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో ట్విట్టర్ లో విపరీతంగా వైరల్ అవుతూ ఉండడంతో పాటు ఏకంగా 125కె కి పైగా లైక్స్ దక్కించుకుని దూసుకెళుతోంది.

మొత్తంగా అందరిలో రోజు రోజుకు మరిన్ని అంచనాలు ఏర్పరుస్తున్న వరిసు 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ తరువాత ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, ప్రభు తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :