
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న క్రికెటర్ విరాట్ కొహ్లీ, అలాగే ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా. వీరిద్దరూ కలిసి ఒకసారి స్క్రీన్ పై కనిపిస్తే అది సినిమా అయినా లేదా ప్రకటన అయినా దానికి ఫుల్ క్రేజ్ వస్తుంది. సినిమా ఎలాగూ చేయరు కాబట్టి వీరిద్దరూ ఒక ఒక యాడ్ లో కలిసి కనువిందు చేయనున్నారు.
ఇప్పటికే ఇలియానా ఓ షాంపూకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. త్వరలో షూట్ చేయనున్న కమర్షియల్ యాడ్ లో వీరిద్దరూ కలిసి నటించనున్నారు. ఇదే కమర్షియల్ యాడ్ కోసం గతంలో కొహ్లీ – అనుష్క శర్మ జోడీ కట్టారు. ఇటీవలే మెయిన్ తేరా హీరో సినిమాతో హిట్ అందుకున్న ఇలియానా ప్రస్తుతం హంశకల్స్ సినిమాలో నటిస్తోంది.

