పాత రజినీని చూస్తారట.. అది కూడ నవ్వుతూ

Published on Apr 17, 2021 3:00 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ చిత్రం ఈమధ్యనే రీస్టార్ట్ అయింది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. అన్ని రకాల జాగ్రత్తల మధ్యన చిత్రీకరణ జరుపుతున్నారు. కొన్నిరోజుల క్రితం చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సినిమాలో రజినీ లుక్ ఎంత గొప్పగా ఉండబోతుందో హింట్ ఇచ్చి అభిమానుల్ని ఉత్సాహపరిచారు.

ఇక తాజాగా రజినీ పాత్ర గురించి మరొక క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. సినిమాలో నటిస్తున్న నటుడు జార్జ్ మర్యన్ రజినీ పాత్ర గురించి మాట్లాడుతూ పాత సినిమాల్లో రజినీ చేసిన కొన్ని పాత్రల్ని గుర్తుచేస్తుందని, ఆయన పాత్రలో బోలెడు హ్యూమర్ ఉంటుందని అన్నారు. అంటే ఇందులో సూపర్ స్టార్ హాస్యాన్ని కూ పుష్కలంగా పండిస్తారని అనుకోవచ్చు. నిజానికి రజినీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈమధ్య ఆ కోణాన్ని కొద్దిగా పక్కనపెట్టారు రజినీ. మళ్ళీ ఇప్పడు దాన్ని బయటకు తీసుకొస్తున్నారంటే అభిమానులకు నవ్వులు ఖాయం. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. రజినీకి జోడీగా నయనతార నటిస్తుండగా కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :