పవన్ సినిమాకు ఈ రెండిట్లో ఒకటి కన్ఫర్మా.?

Published on Feb 25, 2021 3:00 pm IST

నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు రావడంతో ఒక్కసారిగా హైప్ మళ్ళీ మొదలయ్యింది. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో పవన్ చేస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ వండర్ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కోసమే పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

దీనికి ముందు “వకీల్ సాబ్” రేస్ లో ఉన్నప్పటికీ వారి ఇంట్రెస్ట్ దీనిపైనే ఎక్కువగా ఉంది. అయితే మరి ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి పలు ఆసక్తికర టైటిల్సే ఆ మధ్య అంతా సినిమా వర్గాల్లో వైరల్ అయ్యాయి. కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం రెండు టైటిల్స్ బాగా వినిపిస్తున్నాయి.

వాటిలో ఒకటి “హర హర వీరమల్లు” మరొకటి దీనిని షార్ట్ చేసి వీర మల్లు గా పెడతారని వినిపించాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా వీటిలోని ఏదో ఒకటి ఫిక్స్ అవుతుందని టాక్. మరి వీటిలో ఒకటి ఉంటుందా లేక పవన్ స్టార్డం ను మ్యాచ్ చేస్తూ ఈ సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ గా వేరే ఏమన్నా పెడతారా అన్నది తెలియాలి అంటే వచ్చే మార్చ్ 11 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :