స్టార్ డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ భారతీయుడు సీక్వెల్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తాన్నారు. కాగా తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు వచ్చే షెడ్యూల్ లో అజేయ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ ను తీసుకోనున్నారట.
కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో జరగబోయే షెడ్యూల్ లో ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా షూట్ లో పాల్గొంటుందట. కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భవాని కూడా భారతీయుడు సీక్వెల్ లో కీలక పాత్రల్లో నటించబోతున్నారు. 2020లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు.


