శంకర్ నెక్స్ట్ ఈ స్టార్ హీరోతోనే అని స్ట్రాంగ్ బజ్.!

Published on Jan 21, 2021 10:00 am IST

తనదైన సినిమాలతో ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరొందిన సెన్సేషనల్ దర్శకుడు శంకర్. కోలీవుడ్ కు చెందిన ఈ దర్శకుని సినిమాలు ఎప్పుడో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మరి అలాంటి శంకర్ కు ఇప్పుడు కాస్త బ్యాడ్ టైమే నడుస్తున్నప్పటికీ తన సినిమా ప్రకటన వచ్చింది అంటే ఆ హైప్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరి అలా సూపర్ స్టార్ రజినీతో చేసిన “2.0” కు లేటెస్ట్ గా విశ్వ నటుడు కమల్ హాసన్ తో టేక్ చేసిన “భారతీయుడు 2” కి కానీ భారీ అంచనాలే సెట్ చేసుకున్నారు.

మరి దీని తర్వాత మాత్రం శంకర్ ఒక డైరెక్ట్ ఫిల్మ్ నే చెయ్యనున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాను ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా నిలిచిన యష్ తో చెయ్యడం ఫిక్స్ అన్నట్టుగా నయా టాపిక్. మరి అలాగే ఈ భారీ చిత్రాన్ని ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారని సమాచారం. మరి ఈ సెన్సేషనల్ కాంబో కోసం ఇంతకు ముందే ఓసారి వినిపించింది. మరి ఫైనల్ గా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :