మళ్ళీ ప్రభాస్ వారికి రీసౌండింగ్ ఆన్సర్ ఇవ్వాల్సిందేనేమో!

Published on Aug 26, 2021 11:00 am IST


ఇప్పుడు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే యంగ్ రెబల్ స్టార్ పేరు ఒక సెన్సేషన్ మినిమమ్ మొదటి రోజే 100 కోట్లు సునాయాసంగా రాబట్టగలిగే క్యాలిబర్ ఇప్పుడు ప్రభాస్ సొంతం. అందుకే ప్రభాస్ డేట్స్ కోసం ఎన్నాళ్లయినా వేచి ఉండడానికి పలువురు బిగ్ బడ్జెట్ నిర్మాతలు సైతం లైన్ లో నించుంటున్నారు. అయితే పండ్లున్నా చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు అంచలంచలుగా ఎదుగుతున్న ప్రభాస్ పై ఓ వర్గానికి ఇంకా అసూయో మరేమన్నానో కానీ ఇంకా తగ్గలేనట్టు ఉందని చెప్పాలి.

అందుకే లేటెస్ట్ గా బయటకొచ్చిన ప్రభాస్ లుక్స్ పై గుచ్చి గుచ్చి పరుష పదజాలంతో రాయడం సినీ వర్గాల్లో మరింత వేడిని రాజేసింది. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ అందరి హీరోల అభిమానులు కూడా ప్రభాస్ పై వచ్చిన ఆ రాతలు కూతలకు వ్యతిరేఖంగా నిలబడుతున్నారు. అయితే ఇది ప్రభాస్ ని వారు ఎంత తక్కువ చేసి చూపిద్దాం అన్నా కానీ పని..

ఇప్పుడు అంటే ప్రభాస్ రెండేసి సినిమాలుకు ఒకేసారి నిర్విరామంగా వర్క్ చెయ్యడం మూలాన తన లుక్ కొంచెం మారింది. ఏదో కొన్ని ఫోటోలు చూసేసి ఒక హీరో స్టార్డం ని తగ్గించడం నిజంగా తెలివితక్కువతనమే అవుతుంది. మరి అలా మాట్లాడేవారు అందరికీ ప్రభాస్ నుంచి ఇంకో సరైన సమాధానం వస్తే అంతా సెట్ అయ్యిపోతుంది.

లాస్ట్ టైం ప్లాప్ సాహో తోనే ఆ ఇండస్ట్రీలో వసూళ్ల సునామి సృష్టించాడు. ఇంకా బాహుబలిని అయితే ఇంకా ఏ ఇండియన్ స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయారు. అలాంటి ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్స్ కానీ హిట్టయితే వాటి వసూళ్లు వారు లెక్కపెట్టుకోలేనంత పని చెయ్యగలడు ప్రభాస్. మరి ఇక మీదట అయినా ఓ వర్గం ఈ డీగ్రేడింగ్ ని పక్కన పెట్టుకొని ఉంటే బెటర్.

సంబంధిత సమాచారం :