మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ మరువలేని మైలురాయిగా నిలిచిపోయే సినిమా ‘ఇంద్ర’. 2002లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి ఇంద్రసేనారెడ్డి గా కనిపించి మెగా అభిమానులను, తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అదే సంవత్సరం క్లాస్ లుక్ ని పూతి మాస్ లుక్ లోకి వచ్చి విక్టరీ వెంకట్టేష్ చేసిన సినిమా ‘జెమిని’. అప్పటి వరకూ ఒక టైపు వెంకీని చూసిన అభిమానులు జెమిని సినిమాలో పడమటి లంక జెమినిగా చూసి బాగా ఎంజాయ్ చేసారు.
ఈ రెండు సినిమాల రిలీజ్ మధ్య గ్యాప్ ఉన్నా రెండూ 2002లోనే విడుదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ టైంలో ఒకే లొకేషన్ లో కలిసిన చిరంజీవి అలియాస్ ఇంద్రసేనారెడ్డి – వెంకటేష్ అలియాస్ పడమటి లంక జెమిని కలిసి దిగిన అరుదైన ఫోటోని మీకు అందిస్తున్నాం. ఈ ఫోటోపై మీ కామెంట్ ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి..


