వరుణ్ సందేశ్ “ఇందువదన” రిలీజ్ డేట్ ఫిక్స్!

వరుణ్ సందేశ్ “ఇందువదన” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Dec 10, 2021 12:43 PM IST

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం. శ్రీనివాసరాజు దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఈ సినిమా లో జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ సినిమా టీజర్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ వచ్చింది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందువదన. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా, శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక, జెర్సీ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం శ్రీనివాస రాజు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటి, సంగీతం శివ కాకాని, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు