శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా పరిచయమైన నటుడు నాగశౌర్య. ఆ సినిమా విజయం తరువాత ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రం ద్వారా మరోసారి మనముందుకు రానున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఆడియో విడుదలైంది. కొత్త టైటిల్, సరికొత్త స్టోరీ లైన్ ఈ సినిమావైపుకు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి
ఈ చిత్రమేకాక ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా కూడా నిర్మాణ దశలో వుంది. ఇలా టైటిళ్ళను క్యాచీగా పెట్టుకుని శౌర్య ప్రేక్షకులను ఆకర్షించడం కొత్త ట్రెండ్ గా నిలుస్తుందేమో


