ఇన్సైడ్ టాక్..”సలార్” ను ఇలాగే తెరకెక్కిస్తున్నారు!

Published on Feb 19, 2021 7:01 am IST

ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో “సలార్” కూడా ఒకటి. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” తర్వాత ప్రశాంత్ నీల్ అందులను ప్రభాస్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చెయ్యడంతో భారీ అంచనాలు సెట్టయ్యాయి.

అయితే ఈ బడా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన నాటి నుంచి కూడా కొన్ని విషయాలను అయితే గోప్యం గా ఉంచుతూ వచ్చారు. మరి వాటిలో ఈ సినిమాను ఇంతకీ ఏ భాషలో తెరకెక్కిస్తున్నారు అన్నది కూడా ఒకటి. కానీ దానికి ఆల్ మోస్ట్ సరైన సమాధానం దొరికినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని కన్నడ భాషలోనే తెరకెక్కిస్తున్నారట. అలాగే తెలుగులో కూడా ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారని టాక్ ఉంది. కన్నడలో అయితే ఖచ్చితంగా తీస్తున్నారని అక్కడి సినీ వర్గాలు హీరోయిన్ శృతి హాసన్ ఎంట్రీతో చెప్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :