టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన మూవీ ‘భైరవం’. దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం రస్టిక్ యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది. ధర్మం కోసం నిలబడే ముగ్గురు స్నేహితుల కథే ఈ సినిమాలో మనకు చూపెట్టబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఓ దేవాలయం చుట్టూ ఈ కథ సాగుతుండటం.. దాని కోసం స్నేహితులు శత్రువులుగా ఎలా మారుతారు అనేది మనకు ఈ సినిమా కథగా దర్శకుడు చూపెట్టబోతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు ఆకట్టుకునే డైలాగులు కూడా చెబుతారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇంటెన్స్ యాక్షన్‌తో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కించారు.
ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిల్లై, జయసుధ, అజయ్, వెన్నెల కిషోర్, సందీప్ రాజ్ అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. మే 30న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
