టాక్..”ఆచార్య” పై ఆసక్తి తగ్గుతుందా.?

Published on Sep 29, 2021 7:00 am IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే హై బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా వరకు తన టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసేసిన మెగాస్టార్ దీని తర్వాత సినిమాలు కూడా స్టార్ట్ చేసేసారు. అయితే ఎప్పుడు నుంచో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితులు రీత్యా ఈ సినిమా రిలీజ్ ఆగుతూ వస్తుంది.

మరి ఇదే కాకుండా మరిన్ని కారణాలు అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తున్నాయని టాక్.. అప్పుడెప్పుడో ఆచార్య నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చి మంచి చార్ట్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత కూడా అరకొర అప్డేట్స్ వచ్చాయి మొన్న మెగాస్టార్ బర్త్ డే కి కూడా పెద్ద చెప్పుకోదగ్గ అప్డేట్స్ కూడా రాకపోవడం మెగా ఫ్యాన్స్ లో కాస్త నిరుత్సాహం నెలకొల్పింది. తర్వాత చిన్న అప్డేట్స్ తో మళ్ళీ పుంజుకుంది అనుకుంటే మళ్ళీ కొన్నాళ్ళకి మేకర్స్ నుంచి ఎలాంటి కదలిక లేదు.

దీనితో అభిమానుల్లో అప్డేట్స్ లేక కనీసం రిలీజ్ సమయం కూడా తెలియక ఎదురు చూస్తున్నారు. అయితే మొన్ననే చిరు ఈ సినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతుంది అన్నదానిపై వివరణ ఇచ్చారు. మరి ఇది పక్కన పెట్టినా కనీసం మినిమమ్ అప్డేట్స్ కూడా రావడం లేదని ఒకింత ఫ్యాన్స్ నిరాశలోనే ఉన్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ మెగా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ నుంచి సెకండ్ సింగిల్ ఇతర అప్డేట్స్ ఎప్పుడు నుంచి షురూ అవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :