మే 20న అభిమానులకి తారక్ బహుమతివ్వనున్నాడా ?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ‘జై లవ కుశ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా యొక్క రెండవ షెడ్యూల్ ను ఈరోజు నుండి హైదరాబాద్లో మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్లో కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్ కు షూట్ చేస్తారట.

ఇక తాజాగా సినీ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఈ మే నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ ను విడుదల చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఇంకా ఎలాంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇంకా అందలేదు. మరి తారక్ తన జన్మదినాన ఫ్యాన్సుకు బహుమానమిస్తాడో లేదో చూడాలి.