“కేజీయఫ్ 2″లో ఓ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jul 13, 2021 9:00 am IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు రాకింగ్ స్టార్ యష్ ల కాంబోలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ఎనలేని క్రేజ్ ను మొత్తం దేశ వ్యాప్తంగా సొంతం చేసుకున్న ఈ క్రేజీ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఇది ఒకింత ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి.

ఈ చిత్రంలో యష్ పోషించిన రాఖీ భాయ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలిసిందే. అలాగే అదే కోణంలో మొదటి పార్ట్ లో గరుడ పాత్రను చూపించారు. మరి ఈసారి అంతకు ధీటుగా అధీరా పాత్రను నీల్ డిజైన్ చేసినట్టు అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను నెవర్ బిఫోర్ మేకోవర్ లో ప్రెజెంట్ చేసి మరిన్ని అంచనాలు పెంచేశారు.

ఇప్పుడు అతని రోల్ పైనే ఒక అదిరే పాటని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అదే పవర్ ఫుల్ సాంగ్ తోనే అధీరా పాత్ర ఎంట్రీ ఇవ్వనుంది అని కూడా టాక్. ఇప్పటికే ఈ సినిమా ఆడియోపై కూడా సాలిడ్ అంచనాలు ఉన్నాయి. మరి ఈ బజ్ ఎంత వరకు నిజం అన్నది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ నే సంగీతం అందించిన సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :