అఖిల్ తరువాత సినిమాల పై ఇంట్రస్టింగ్ బజ్ !

Published on Apr 19, 2021 3:01 pm IST

అక్కినేని అఖిల్ – పూజా హెగ్డే కలయికలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా పై అక్కినేని అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అఖిల్ చేస్తోన్న తరువాత సినిమాల పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ‘ఏజెంట్’ పేరుతో భారీ బడ్జెట్ స్పై థ్రిల్లర్ ను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేయబోతున్నట్లు అఖిల్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ లో ఈ చిత్రం తెరపైకి వెళ్లనుంది.

ఇప్పుడు, ఫిల్మ్ సర్కిల్స్‌ లో అఖిల్ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. అఖిల్ వచ్చే ఏడాది ప్రముఖ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడట. ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతోన్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. అయితే రిలీజ్ డేట్ ను మేకర్స్ మార్చేలా కనిపిస్తున్నారు.

కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది.

సంబంధిత సమాచారం :