బాలయ్య “అఖండ”పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 17, 2021 12:18 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్లాన్ చేసిన సూపర్ హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దానికన్నా ముందు థమన్ ఇస్తున్న ఎనర్జెటిక్ మ్యూజిక్ ని వినాలని అంతా అనుకుంటుండగా థమన్ నిన్న ఈ సినిమా మాస్ ఆల్బమ్ పై అదిరే అప్డేట్ ని ఇచ్చాడు.

అయితే ఈ సినిమా పై రానున్న రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నట్టుగా వినికిడి. సాంగ్ కాకుండా వేరేగా సినిమా రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ నుంచి ఓ అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా బజ్ వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం రాబోవు రోజుల్లో అఖండ నుంచి సాలిడ్ ట్రీట్ రెడీగా ఉంది దానిని విట్నెస్ చెయ్యడానికి రెడీగా ఉండండి మరి.. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :