చరణ్, శంకర్ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 5, 2021 5:37 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటిస్తున్న పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ శంకర్ తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం కూడా ఒకటి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఆసక్తిగా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అలా రీసెంట్ గానే ఈ భారీ చిత్రంలో నటించేందుకు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ ఓకే చెప్పేలా ఉన్నాడని బజ్ మొదలయ్యింది.

మరి తన రోల్ కు సంబంధించే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ ది విలన్ రోల్ అట. అయితే అన్ని భాషల్లో కూడా కిచ్చానే కనిపిస్తాడా లేదా అన్నది తెలియరాలేదు కానీ తాను చేసేది విలన్ రోల్ అని ఇపుడు గాసిప్ మొదలయింది. మరి ఇందులో ఎంత నిజముందో కాలమే నిర్ణయించాలి. అలాగే ఈ భారీ చిత్రం మొదలు కావడానికి కూడా కాస్త సమయం పట్టేలానే ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :