‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమాలో ఆ హీరోయిన్ ఫైనల్ ?

Published on Apr 11, 2022 7:07 am IST

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. బాలీవుడ్ నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకునే ఆలోచనలో ఉంది టీమ్.

ఒకవేళ ఇదే నిజమైతే, ప్రధాన తారాగణంలో దీపికా కూడా చేరితే… ఈ చిత్రం పై ఉన్న హైప్‌ రెట్టింపు అవుతుంది. ప్రస్తుతానికి అయితే హిందీ సోషల్ మీడియాలో ఈ ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ప్రశాంత్ నీల్ అక్టోబర్‌ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. అక్టోబర్‌ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :