పవన్ క్రేజీ రీమేక్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jul 2, 2021 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలను ఏకకాలంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో ఒకటి క్రిష్ తో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” కాగా మరొకటి దర్శకుడు సాగర్ చంద్రతో ప్లాన్ చేసిన సాలిడ్ రీమేక్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్.

ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమాపై మాస్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి అలాగే అందుకు తగ్గట్టుగానే దర్శకుడు సహా త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు సాలిడ్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయట.

అలాగే వాటిలో ఒకటి ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి అవి ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాలి. ఇక ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :