పవన్ మాస్ చిత్రంలో క్రేజీ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jun 22, 2021 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ సాలిడ్ ప్రాజెక్ట్స్ లో యంగ్ అండ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. మాస్ లో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం మళ్ళీ షూట్ ను త్వరలో స్టార్ట్ చేసుకోనుంది. మరి అలాగే ఈ చిత్రంలో ఓ అదిరే ఫోక్ సాంగ్ కూడా ఉందని నేరుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నే తెలిపాడు.

అయితే ఈ చిత్రంలో పవన్ తో పాడించేది ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయా అన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ ఈ మాస్ ట్రీట్ పై మరో బజ్ ఇపుడు వినిపిస్తుంది. ఈ చిత్రానికి గాను రాయలసీమ ప్రాంత జానపద గేయ రచయిత పెంచల్ దాస్ సాహిత్యం అందిస్తున్నారట.

అయితే ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పెంచల్ దాస్ ను త్రివిక్రమ్ తన “అరవింద సమేత” తో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. పైగా ఈ చిత్రం పవన్ బ్యాక్ డ్రాప్ కూడా రాయలసీమ టచ్ లోనే ఉంటుంది అని టాక్ ఉంది. మరి ఇది ఎంత వరకు నిజముతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :