ప్రభాస్ సినిమాపై ఆసక్తికర బజ్..!

Published on Aug 15, 2020 7:02 am IST

డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ రెంటి తర్వాత కూడా మరో రెండు భారీ ప్రాజెక్టులు లైనప్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మొదటి విడుదలకు రెడి అవుతున్న చిత్రం “రాధే శ్యామ్”.

భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ పీరియాడిక్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా పై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. ఈ చిత్రంతో మొదటి సారిగా ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీంతో ఈ జంటకు ఈడు జోడు కరెక్ట్ గా సెట్ అవుతుందని మంచి మార్కులు పడ్డాయి.

అలాంటి పూజా ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించనుంది అని లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఇది కూడా ఖచ్చితంగా సినిమాపై మంచి అంచనాలను పెంచే అంశమే అని చెప్పాలి. మరి దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ఏ విధంగా ప్లాన్ చేశారో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More