ఆర్ ఆర్ ఆర్ లో ఆయన రోల్ అదేనా?

Published on Jul 15, 2020 9:36 am IST

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడింది. ఇప్పటికే 70శాతం వరకు షూటింగ్ పూర్తికాగా సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే తిరిగి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. కాగా ఈ మూవీలో తమిళ దర్శకుడు మరియు నటుడు అయిన సముద్ర ఖని ఓ కీలక రోల్ చేస్తున్నారు.ఆ పాత్ర కోసం భారీ మొత్తం చెల్లింది ఆయన్ని తీసుకున్నారని ప్రచారం జరిగింది.

ఐతే ఆర్ ఆర్ ఆర్ లో సముద్ర ఖని రోల్ పై ఓ ఆసక్తికర కథనం చక్కర్లు కొడుతుంది. ఆర్ ఆర్ ఆర్ హీరోయిలైన ఎన్టీఆర్ మరియు చరణ్ లకు సహాయకుడిగినా ఆయన పాత్ర ఉంటుందట. ప్రత్యర్థులపై కొమరం భీమ్, అల్లూరి చేసే పోరాటాలలో వారికి సహాయం చేసే వాడిగా సముద్ర ఖని పాత్ర ఉంటుందట. కాగా ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ మరో కీలక రోల్ చేస్తుండగా, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More