“కల్కి” రచయిత “అశ్వథ్థామ” డైరెక్టర్ కాంబోలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!

“కల్కి” రచయిత “అశ్వథ్థామ” డైరెక్టర్ కాంబోలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!

Published on Oct 25, 2020 3:05 PM IST

ఇటీవలే కాలంలో మన తెలుగులో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అలాగే అలాంటి చిత్రాలను అందిస్తున్న దర్శకులు మరియు రచయితల నుంచి అలంటి మరిన్ని ప్రాజెక్టులు రావాలని అంతా ఎదురు చూస్తున్నారు. ఇపుడు లేటెస్ట్ గా అలాంటి ఒక ఆసక్తికర కాంబోనే సెట్టయ్యింది.

ఈ ఏడాది వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ “అశ్వథ్థామ” చిత్ర దర్శకుడు రమణ తేజ అలాగే డాక్టర్ రాజశేఖర్ తో “కల్కి” అనే ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ డ్రామాకు కథను అందించిన రచయిత దేశరాజ్ సాయి తేజాల కాంబోలో మరో ఆసక్తికర ప్రాజెక్ట్ మొదలు మొదలు కానుంది.

వీరిలో కాంబోలో ఒక సినిమా ఉన్నట్టుగా ఈ దసరా సందర్భంగా నిర్మాణ సంస్థ ఎస్ ఆర్ టి ఎంటెర్టైన్మెంట్స్ అధినేత రామ్ తళ్లూరి ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ జరుగుతుందని అతి త్వరలోనే పూజా కార్యక్రమంతో మొదలయ్యి ఇంకా మిగిలిన వివరాలు కూడా అప్పుడు ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు