“పుష్ప”లో ఫహద్ రోల్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్.!

Published on Aug 28, 2021 4:40 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కాంబోలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా ఇపుడు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి ఈరోజు మేకర్స్ నటుడు ఫహద్ ఫాజిల్ రోల్ ని రివీల్ చెయ్యడమే కాకుండా తన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.

అయితే ఊహించని రీతిలో ఫహద్ ని ప్రెజెంట్ చెయ్యడంతో మరింత హైప్ ఈ చిత్రంపై నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా ఫహద్ రోల్ పై ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఫహద్ కి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది అట.. అది కూడా ఈ కథ రిలేటెడ్ గా ఉంటుందని తెలుస్తుంది.

అయితే వీటిని పక్కన పడితే తన లుక్ పోస్టర్ ని గమనిస్తే తన ముఖంలోని ఒక పక్క కంప్లీట్ గా నీడలో ఉండేలా చూపించారు. మరి బహుశా ఇది దానికి సంకేతం కూడా కావచ్చు. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఫహద్ రోల్ పై ఈ డీటెయిల్ కాస్త ఆసక్తిని రేపుతోంది.

సంబంధిత సమాచారం :