‘అఖండ 2’ ప్రీమియర్ల పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

‘అఖండ 2’ ప్రీమియర్ల పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Dec 1, 2025 3:00 PM IST

Akhanda-2

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5, 2025న గ్రాండ్ గా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే, ఈ చిత్రం డిసెంబర్ 4, 2025న ప్రీమియర్లు పడబోతున్నాయి. అభిమానులకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. నిర్మాతలు ప్రీమియర్లకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టిక్కెట్ల ధరల పెంపు గురించి కూడా చర్చలు జరిపారని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అన్నట్టు ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ట్రెండ్‌ సృష్టించిన విషయం తెలిసిందే. అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు