“రాధే శ్యామ్”లో పూజా రోల్.. ఓ సీన్ పై ఇంట్రెస్టింగ్ డీటైల్.!

“రాధే శ్యామ్”లో పూజా రోల్.. ఓ సీన్ పై ఇంట్రెస్టింగ్ డీటైల్.!

Published on Apr 17, 2021 9:15 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమ్ ఆదిత్య, పూజా హెగ్డే ప్రేరణ అనే ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు..

అయితే మరి ఈ ఇద్దరి రోల్స్ కు సంబంధించే ఓ సన్నివేశం మరియు పూజా ఎలా కనిపిస్తుందో అన్న దానిపై ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ బయటకు వచ్చింది. మరి దాని ప్రకారం పూజా ఈ చిత్రంలో ఓ మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తుంది అని తెలుస్తుంది. అలా ఓ హాస్పిటల్ లో పని చేసే పూజా దగ్గరకి విక్రమ్ ఆదిత్య ఓ ప్రమాదం వల్ల వైద్యానికి రావాల్సి వస్తుంది అక్కడ నుంచి వీరి మధ్య అందమైన ప్రేమ కథ టేకాఫ్ అవుతుందట.

మరి ఇది ఎంత వరకు నిజమో కానీ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు. ఇక ఈ చిత్రానికి మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు