RC17: చరణ్, సుకుమార్ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్!

RC17: చరణ్, సుకుమార్ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్!

Published on Jul 16, 2026 9:00 AM IST

rc17

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. రొటీన్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా “పెద్ది” తర్వాత సుకుమార్ తో చేయనున్న ప్రాజెక్ట్ పై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ చర్చలు నడుస్తున్నాయి.

సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది కానీ ఈ గ్యాప్ లో రామ్ చరణ్ లుక్స్ సహా హీరోయిన్స్ కోసం వినిపిస్తుంది. చరణ్ పెద్ది కోసం సిద్ధం చేసిన బల్క్ లుక్ నుంచి కొంచెం స్లిమ్ అవ్వడం మొదలు పెట్టగా హీరోయిన్స్ పరంగా మొదటిసారి ఇద్దరిని ఫిక్స్ చేస్తున్నారు అన్నట్టు వచ్చిన కొత్త రూమర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు