‘శాకుంతలం’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు !

Published on Jun 2, 2021 5:03 pm IST

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్, సమంత అక్కినేని టైటిల్ రోల్ తో ప్రస్తుతం చేస్తోన్న ‘శాకుంతలం’ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా గుణశేఖర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా యాభై శాతం చిత్రీకరణ పూర్తయిందని, మే 10 వరకూ చిత్రీకరణ జరిపాం అని, ఒంటి గంట వరకు ప్రభుత్వం నుంచి లాక్‌ డౌన్‌ వెసులుబాటు లభించింది కాబట్టి, అతి త్వరలోనే రెండో షెడ్యూల్‌ ను కూడా మొదలుపెడతాం అని చెప్పుకొచ్చాడు.

అన్నట్టు ఇంత వేగంగా షూటింగ్ ను పూర్తి చేయడానికి కారణం సమంత అట. సమంతనే తన కథకి హీరో అని, ఇంత భారీ సెట్లు వేశారు కదా, చిత్రీకరణ ఆలస్యమైతే నిర్మాతలుగా మీరు ఇబ్బంది పడతారంటూ సమంత సెట్‌కి వచ్చేదట. తన కుమార్తె చిత్ర నిర్మాత నీలిమ గుణ ప్లానింగ్‌ చాలా బాగుందని, ఆమె సెట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణకి అనువైన వాతావరణం సృష్టిస్తోందని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :