నాగార్జున ట్రెండ్ సెట్టింగ్ మూవీ కోసం నిజమైన రౌడీలనే వాడారట

Published on Oct 17, 2019 7:08 am IST

అక్కినేని నటవారసుడిగా తెరంగేట్రం చేసిన నాగార్జున రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రంతో మెదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కమర్షియల్ గా కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, తెలుగు చిత్రాలలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. వర్మ తన మొదటి చిత్రం తోనే ఎక్కడికో వెళ్లిపోయారు. వర్మ టేకింగ్ తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచింది. ఐతే ఈ చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేసిన దర్శకుడు తేజా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఓ మూవీ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శివ చిత్రం షూటింగ్ సమయం లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పు కొచ్చారు. శివ మూవీలో మెయిన్ విలన్స్ పక్కన కనిపించే రౌడీల పాత్రల కోసం నిజమైన గుండాలను తీసుకున్నారట. దీనితో షూటింగ్ ఉంటే, వాళ్ళు ఏ పోలిస్ స్టేషన్ లో ఉన్నారో ఆ ముందు రోజు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదట. వారిని నటింప చేయడానికి తలప్రాణం తోక కొచ్చేదట. చెన్నై నుండి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి పూర్తిగా రాని ఆ సమయంలో ఇక్కడ నటుల కొరత తీవ్రంగా ఉండటం వలన శివ సినిమా కోసం నిజమైన గుండాలు, రౌడీ షీటర్ల ను తీసుకున్నారట. అప్పట్లో హైదరాబాద్ లో పది మంది నటులు కూడా ఉండేవారు కాదుట.

1989లో వచ్చిన శివ చిత్రం విడుదలై 30ఏళ్ళు అవుతుంది. నాగార్జున సరసన అమల నటించిన ఈ చిత్రంలో రఘు వరన్, కోట శ్రీనివాసరావ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు చేశారు. ఇళయరాజా మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :

More