‘వార్ 2’ పై ఇంట్రెస్టింగ్ విషయాలు !

‘వార్ 2’ పై ఇంట్రెస్టింగ్ విషయాలు !

Published on May 20, 2025 7:58 AM IST

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఐతే, మరికొన్ని గంటల్లో వార్-2 సినిమా నుంచి వీడియో రాబోతోంది. ఈ వీడియో ఎన్టీఆర్ కు కూడా సర్ ప్రైజ్ ఇస్తుందని స్వయంగా హృతిక్ రోషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ వీడియో కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయట. పైగా అందులో ఒక సాంగ్ ను హృతిక్ రోషన్ – కియరాపై తీశారు. కియరా బికినీలో కనిపిస్తోందట. ఇక రెండో పాటను హృతిక్-ఎన్టీఆర్ పై షూట్ చేయనున్నారు. వచ్చే నెల హృతిక్-తారక్ పై ఈ సాంగ్ ను 7 రోజుల పాటు షూట్ చేస్తారట, ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు