విజయ్ దేవరకొండ పై ఇంట్రస్టింగ్ గాసిప్ !

Published on Mar 3, 2019 5:06 pm IST

విజయ్ దేవరకొండ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార విజయ్ దేవరకొండ సరసన నటించబోతుందని ఆ న్యూస్ లోని సారాంశం. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఎస్.ఆర్ ప్రభు ఈ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నారు.

అయితే నయనతారకు జోడిగా విజయ్ దేవరకొండ అనేసరికి నెటిజన్లలో కూడా ఈ వార్త పై ఆసక్తి పెరుగుతుంది. ఇక విజయ్ దేవరకొండ ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో ‘నోటా’ చిత్రాన్ని చేశాడు. ఎలాగైనా తమిళంలోనూ మార్కెట్ పెంచుకోవాలని విజయ్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు.

మరి విజయ్ ఎదురుచూపులకు నయనతార రూపంలో.. తమిళంలో కూడా భారీ హిట్ వస్తుందేమో చూడాలి. అయితే అసలు ఈ వార్తకు సంబధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :