మహేష్ మాఫియా డాన్ గా..?

Published on Dec 5, 2019 8:21 pm IST

మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్-రష్మిక కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయ శాంతి చాలా కాలం తరువాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుండగా సంక్రాంతి కానుకగా వచ్చేనెల 11న విడుదల కానుంది. ఐతే ఈ చిత్రం తరువాత మహేష్ వంశీ పైడిపల్లి తో మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మహేష్ తో మహర్షి వంటి హిట్ మూవీ తెరకెక్కించిన ఈ దర్శకుడు దీనిపై స్పష్టత కూడా ఇచ్చారు.

కాగా వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న మహేష్ తదుపరి చిత్ర కథపై కూడా ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమనగా మహేష్ ని వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రంలో మాఫియా డాన్ గా చూపించనున్నారట. తన తోటి గ్యాంగ్ స్టర్స్ ని హడలెత్తించే మాఫియా లీడర్ రోల్ లో మహేష్ విజృభించనున్నాడని టాలీవుడ్ లో నడుస్తున్న చర్చ. గతంలో బిసినెస్ మెన్ సినిమాలో పూరి జగన్నాధ్ మహేష్ ని ఒక క్లాసికల్ మాఫియా లీడర్ గా చూపించాడు. మరి ఇదే నిజం ఐయితే వంశీ పైడిపల్లి మహేష్ ని మాఫియా లీడర్ గా ఎలా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More