“సలార్”లో శృతి రోల్ పై ఇంట్రెస్టింగ్ గాసిప్స్.!

Published on Jun 23, 2021 8:01 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత చిత్రాల్లో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “సలార్” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ను సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రం షూట్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యేందుకు రెడీగా ఉన్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకి వచ్చింది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఆమె రోల్ పైనే టాక్ తెలుస్తుంది. ఈ చిత్రంలో మొదట శృతి రోల్ లిమిటెడ్ గా ఉంటుందని తెలియగా ఇప్పుడు మాత్రం ఆమెతో కూడా యాక్షన్ టాకీ షూట్ ఉంటుందని తెలుస్తుంది. అందుకు గాను ఆమె స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో ఇంకొన్నాళ్ళు వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :