ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వాళ్ళ కోసం.!

Published on Jun 25, 2021 9:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్ కి అంగలు వేస్తున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు పలు పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నా వాటిలో పాన్ వరల్డ్ సినిమాగా అనౌన్స్ అయ్యింది మాత్రం టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమా. భారీ స్కై ఫై ఫాంటసీ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంపై ఇపుడు ఆసక్తికర సమాచారం బయటకి వచ్చింది.

అయితే ఈ చిత్ర యూనిట్ ఇంజినీరింగ్ లో ప్రతిభావంతులు అయినటువంటి డిజైనర్స్, బిల్డర్స్ అలాగే ప్రాప్స్ మరియు వెహికిల్ డిజైనర్స్ కోసం చూస్తున్నారట. అందుకోసం ఇండస్ట్రియల్, మెకానికల్, రోబోటిక్స్, ఎలెక్ట్రికల్ ఇలా పలు విభాగాల్లో ప్రావీణ్యం ఉన్నవారిని తమ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారికి వారి డిజైన్స్ ఫొటోస్ తో డైరెక్ట్ మెసేజ్ చెయ్యమన్నారు.

ఇప్పుడు ఇదే పోస్ట్ హాట్ టాపిక్ అవుతుంది. మరి ఎంతో టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇంజినీర్స్ ఓ అద్భుత అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి మీలో కానీ మీకు తెలిసిన వాళ్లలో కానీ ఎవరైనా ఉంటే ఈ భారీ చిత్రంలో పని చేసే అవకాశం దక్కించుకోవచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అలాగే దీపికా పదుకొనె నటిస్తుండగా వైజయంతి మూవీస్ వారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :