నితిన్ “మాస్ట్రో” ఓటిటి రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jun 22, 2021 7:01 am IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ట్రో”. స్టార్ హీరోయిన్ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. అయితే బాలీవుడ్ భారీ హిట్ చిత్రం అందధూన్ కి రీమేక్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇటీవలే టోటల్ షూట్ ని కూడా విజయవంతంగా ఫినిష్ చేసుకుంది. మరి ఈ క్రమంలోనే ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఓటిటి రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని టాక్ వినిపించింది.

మరి ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కే దాదాపు కన్ఫర్మ్ అట. అలాగే ఈ చిత్రం ఏ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రానుంది కూడా తెలుస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం ఇవ్వగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :