“ఫ్యామిలీ మ్యాన్” సిరీస్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jun 12, 2021 10:00 am IST

ప్రస్తుతం ఓటిటి లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇండియన్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2”. మనోజ్ బాజ్ పై మెయిన్ లీడ్ లో స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని నటించిన ఈ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి సీజన్ కంటే పెద్ద హిట్టయ్యింది. దీనితో ఈ సిరీస్ ను డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే లపై మరింత స్థాయి ప్రశంసల జల్లు కురిసింది.

మరి ఇప్పుడు ఇంతలా పాపులర్ కాబడిన ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో తెలుస్తుంది. మొదటి సీజన్ 2019 లో విడుదలై ఈ రెండేళ్ల గ్యాప్ తర్వాత సీజన్ 2 విడుదల అయ్యింది. కానీ ఇక్కడే ఆసక్తికర అంశం ఏమిటంటే అసలు సీజన్ 1 రిలీజ్ కాకముందే రాజ్ అండ్ డీకే లు సీజన్ 2 కథను కంప్లీట్ చేసేసుకున్నారట.

మాములుగా అయితే ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనో లేకో పార్ట్ 1 రిలీజ్ అయ్యాకో రెండో భాగం కథ రాసుకుంటారు. కానీ వీరు మాత్రం సీజన్ 1 రిలీజ్ కాకముందే సిద్ధం చేసుకున్నారంటే వారి కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మేకర్స్ ఆల్రెడీ సీజన్ 3 స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసారన్న టాక్ ఉంది.

సంబంధిత సమాచారం :