‘ఆచార్య’లో ఎమోషనల్ పాత్ర అదే !

Published on Jun 6, 2021 10:20 pm IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో పోసాని నటిస్తున్నాడు. పోసాని పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని.. టెంపర్ సినిమాలో నిజాయితీ గల పోలీస్ గా నటించి మెప్పించిన పోసాని, ఆచార్యలో కూడా అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నాడట. నీతి కోసం, న్యాయాన్ని బతికించడం కోసం ప్రాణ త్యాగం చేస్తాడట. ఇంటర్వెల్ లో పోసాని పాత్ర చనిపోతుందట.

ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. నిజానికి కొరటాల కథలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. పైగా కొరటాల సినిమాలో కూడా ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ పెట్టారు. అది శ్రీధర్ సిపాన చేత రాయించారు. మొత్తానికి మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో.

సంబంధిత సమాచారం :