నయన్ కు ఆగస్టు బాగా కలిసొచ్చింది !

నయన్ కు ఆగస్టు బాగా కలిసొచ్చింది !

Published on Sep 3, 2018 11:23 PM IST

nayanatara

లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఈ ఆగస్టు బాగా కలిసొచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన రెండు చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. దాంట్లో భాగంగా నయనతార నటించిన లేడీ ఓరియేంటేడ్ చిత్రం ‘కొలమావు కోకిల’. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకేక్కించిన ఈచిత్రం ఆగస్టు 17న విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. ఒక్క తమిళనాడు లోనే ఈచిత్రం 25కోట్ల గ్రాస్ ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇటీవల ఈచిత్రం ‘కోకో కోకిల’ పేరుతో విడుదలై ఈసినిమా మంచి రివ్యూస్ నే సొంతం చేసుకున్న ప్రమోషన్స్ లేకపోవడంతో ప్రేక్షకులకు అంత గా చేరువకాలేకపోయింది.

ఇక ఇటీవల ఆమె నటించిన మరొక చిత్రం ‘ఇమ్మైక నొడిగళ్’. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇలా ఆమె నటించిన రెండు చిత్రాలు ఒకే నెలలో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాలను సొంతం చేసుకోవడం విశేషం.

తాజా వార్తలు