అజయ్ దేవగణ్ పాత్ర వల్లే.. ఎన్టీఆర్ – చరణ్.. !

Published on Mar 18, 2019 4:50 pm IST

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాక.. చిత్రబృందం మూడో షెడ్యూల్ కోసం నార్త్ ఇండియాకు వెళ్లనుంది.

కాగా నార్త్ ఇండియాలో జరగ బోయే షెడ్యూల్ లో ఎన్టీఆర్ – చరణ్ లతో పాటు అజయ్ దేవగణ్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారట. అయితే అజయ్ దేవగణ్ కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే సినిమాలో కనిపిస్తారట.

అయినప్పటికీ.. అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్ పాత్ర ప్రేరణాత్మకంగా ఉండనుందని సమాచారం. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More