
ప్రేమ కథలనే ఓ సరికొత్త స్టైల్లో ప్రెజెంట్ చేసి సౌతిండియాలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సెల్వ రాఘవన్. తన గత చిత్రం ‘వర్ణ’ (ఇరండామ్ ఉలగమ్) భారీ అపజయాన్ని మూటగట్టుకోవడంతో ఆయన దాదాపుగా సినిమాలకు దూరమయ్యారనే టాక్ వినిపించింది. అయితే వాటన్నింటినీ తోసిపుచ్చుతూ తనకు బాగా కలిసివచ్చిన ప్రేమకథ నేపథ్యంలోనే శింబు, త్రిష, తాప్సీ, జగపతిబాబులతో ఓ సినిమా తెరకెక్కించనున్నారు.
తాజాగా ఈ సినిమాలో నటించనున్న లీడ్ యాక్టర్స్‌తో ఓ ఫోటోషూట్ కూడా చేశారు. అన్ని పాత్రలు సరిగ్గా సెట్ అయిపోయాయని సెల్వ రాఘవన్ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథగా చెప్పబడుతోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

