ఇంట్రెస్టింగ్..”రాక్షసుడు”కి సీక్వెల్ అనౌన్స్ చేసిన రమేష్ వర్మ.!

Published on Jul 13, 2021 11:02 am IST

తమిళ బ్లాక్ బస్టర్ హిట్ “రాట్సాసన్” చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అలాగే దానిని అంతే సాలిడ్ గా దర్శకుడు రమేష్ వర్మ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ తో తెలుగులో “రాక్షసుడు” గా తీసి మంచి హిట్ అందుకున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ ఏది రాలేదు కానీ తెలుగులో మాత్రం దీనికి సీక్వెల్ ను అనౌన్స్ చెయ్యడంగా ఇంట్రెస్టింగ్ గా మారింది.

ప్రముఖ నిర్మాత సత్యన్నారాయణ కోనేరు అలాగే హవీష్ ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం ఈరోజు అనౌన్స్ కాబడింది. ఫస్ట్ పార్ట్ తరహాలోనే ఆసక్తికర పోస్టర్ డిజైన్ తో దీనిని కూడా పొందుపరిచారు. అలాగే హీరో ఎవరు అన్నది మాత్రం ఇంకా హోల్డ్ లోనే ఉంచారు. ఇక అలాగే ఈ చిత్రానికి కూడా ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ నే సంగీతం సమకూరుస్తుండడం గమనార్హం.

సో ఈ సినిమా కూడా మంచి థ్రిల్ ఇవ్వడం ఖాయం అని చెప్పాలి. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకి మాటలు అందిస్తుండడం మరో ఆసక్తికర అంశం. మరి ప్రస్తుతం రమేష్ వర్మ మాస్ మహారాజ్ రవితేజతో “ఖిలాడి” అనే సాలిడ్ యాక్షన్ ఎంటెర్టైనెర్ తెరకెక్కిస్తుండగా దాని తర్వాత ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :