అఖిల్ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ !


అక్కినేని అఖిల్ తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. స్వయంగా అక్కినేని నాగార్జున పూర్తి శ్రద్ద తీసుకుని నడిపిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై సినీ వర్గాల్లో, అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గత ఏప్రిల్ నెల 4 వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని త్వరలో ఇంకొద్ది రోజుల్లో రెండవ షెడ్యూల్ కు వెళ్లనుంది.

అయితే ఈ చిత్రం గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేమిటంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు ఈ చిత్రంలో నటిస్తున్నారట. అది కూడా అఖిల్ కు తల్లి పాత్రలో కావడం విశేషం. అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇకపోతే ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ అనే క్లాసీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి పి. ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.