‘ఆది పురుష్’ నుండి పట్టాభిషేకం స్టిల్ !

Published on Apr 11, 2021 3:00 am IST

‘ప్రభాస్’ శ్రీరాముడి పాత్రలో రానున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా “ఏ- ఆది పురుష్”. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్ డేట్ ఏమిటంటే శ్రీరామనవమి స్పెషల్ గా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు ఆలోచనలో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే ఎలాంటి లుక్ రిలీజ్ చేయాలా అని ఆలోచిస్తోన్న టీమ్ మేకర్స్ కి సంజయ్ రౌత్ మంచి ఐడియా ఇచ్చాడట. రాముడి పట్టాభిషేకం జరిగే సందర్భంలో స్టిల్ ను రిలీజ్ చేయబోతున్నారట. నిజంగానే ఈ స్టిల్ రిలీజ్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అయినట్టే. ఇక ఈ సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తోంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :