క్రేజీ రీమేక్ కి ఇంట్రస్టింగ్ టైటిల్ ?

Published on Apr 11, 2021 2:00 am IST

మెగాస్టార్ ప్రస్తుతం చేస్తోన్న చిత్రాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా “లూసిఫర్” రీమేక్. అయితే తాజాగా ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ అనుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమిటి ఆ టైటిల్ అంటే ‘కింగ్ మేకర్’ అట. మొత్తానికి ఈ టైటిల్ అయితే ఇంట్రస్టింగ్ గా ఉంది. అలాగే ‘ఆన్న’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ చిరును ఈ సినిమాలో పంచెకట్టులో ఫుల్ లెంగ్త్ రోల్ లో చూడబోతున్నారు. అందుకే ఫ్యాన్స్ కూడా తెగ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు.

ఇక ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా సైతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కథలో కీలక మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. కాగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్‌విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌ పై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :