సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘తొలిప్రేమ’ ఫేమ్ కరుణాకరన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. పెద్దగా యాక్షన్ లేకుండా పూర్తిస్థాయి లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మొదటిసారి తేజ్ చేస్తున్న రొమాంటిక్ ఎంటైనర్ కు ఇప్పటికే పలు పేర్లు వినిపించినా చివరకు దర్శక నిర్మాతలు ‘తేజ్ ది కూడ ఓ మంచి ప్రేమ కథ’ అనే టైటిల్ ను నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కూడ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందలేదు. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంతో వరుస ఫ్లాపుల నుండి బయటపడాలనుకుంటున్నాడు తేజ్.


