‘అంటే.. సుందరానికీ !’.. టైటిల్ భలే ఉందే !

Published on Nov 21, 2020 5:16 pm IST

నాచ్యురల్ స్టార్ నాని కొత్తగా సైన్ చేసిన సినిమాల్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ చిత్రం కూడ ఒకటి. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయనున్నారు. వివేక్ ఆత్రేయ గత చిత్రాలు ‘బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో’ చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కూడ కామెడీ ఎంటర్టైనర్ గానే ఉంటుందని మొదటి నుండి తెలుస్తూనే ఉంది.

తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. చిత్రానికి ‘అంటే.. సుందరానికీ !’ అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ను సుందరానికి తొందరెక్కువ అనే పాపులర్ తెలుగు సామెత నుండి తీసుకున్నట్టు అనిపిస్తోంది. అలాగే కర్టెన్ రైజర్ టీజర్లో కూడ విజువల్స్ లేకుండా కేవలం మాటలతోనే సినిమా బిహేవియర్ ఎలా ఉండబోతుందో చేప్పేశారు టీమ్. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ నటి నజ్రియా కథానాయకిగా నటించనుంది. తెలుగులో ఈమెకు ఇదే మొదటి సినిమా. ఈమధ్య భిన్నమైన కథలను, పాత్రలను ట్రై చేసిన నాని ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More