నితిన్ సినిమాకి వెరైటీ టైటిల్

Published on Oct 5, 2019 10:21 am IST

హీరో నితిన్ వరుసగా కొత్త సినిమాల్ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో సినిమా చేయనున్నాడు నితిన్.

ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెడుతున్నారట. యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఉంటుందట. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒక కథానాయిక కాగా ప్రియా ప్రకాష్ వారియర్ రెండో కథానాయకిగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం :

More