నితిన్ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !

నితిన్ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !

Published on Jun 20, 2018 6:39 PM IST

ప్రస్తుతం హీరో నితిన్ కు హిట్ చాలా అవసరం. ఆయన చేసిన గత రెండు సినిమాలు ‘లై, ఛల్ మోహన్ రంగ’ బాక్సాఫీస్ ముందు విఫలమవడంతో ప్రేక్షకులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అందుఎక్ ఈసారి చేయబోయే సినిమాతో ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పించాలని భావించిన ఆయన ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుములతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు.

సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతేగాక దానికి సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ ను తగిలించారట. ఈ రెండూ చూస్తే సినిమా మంచి ఎంటెర్టైనింగా ఉంటుందని అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఇకపోతే నితిన్ ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేసిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం ఆఖరి దశ పనుల్లో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు